కొబ్బరి నీళ్లలో ఎన్నో సుగుణాలు

వేసవిలో ఆరోగ్య సంరక్షణ

పెరిగిన ఎండల తీవ్రతతో గొంతు ఎండిపోవడం, తలనొప్పి, చెమటలు వంటి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.. ఇంటా బయటా పనిచేసే మహిళలకు ఈ కాలం మరింత అలసటగా ఉంటుంది.. అలాంటపుడు కొబ్బరి బోండాలను చూస్తే ప్రాణం లేచి వస్తుంది కదా.. నిస్సత్తువను తరిమికొట్టే కొబ్బరి నీళ్లలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో చూడండి..

Coconut Water-Benefits
Coconut Water-Benefits
  • వేసవి తాపాన్ని తగ్గించటంలో కొబ్బరి నీళ్లది మొదటి స్థానం.. విటమిన్స్ , ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున ఇది సంపూర్ణ పోషకాహారం. డీహైడ్రేషన్ సమస్య ఉండదు…
  • రోజూ ఒక కొబ్బరి బొండాం తాగితే చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.. ముఖమూ, చేతులూ కాంతివంతగం ఉంటాయి.. జీర్ణ ప్రక్రియ పెంపొందుతుంది.. మలబద్ధకం సమస్య తలెత్తదు..
  • మధుమేహ రోగులకు రక్తం లో చక్కెర స్థాయిని తగ్గించటంలో సాయ పడుతుంది… శరీరంలోని అధిక లవణాలను తలగిస్తుంది.. కొబ్బరి నీళ్లలో కొవ్వు లేనందున ఊబకాయం రాదు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి.. రక్తపోటు, గుండెపోటులను నివారిస్తాయి..
  • ఈ కాలంలో వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే అలసట తగ్గి ఉపశమనం కలుగుతుంది.. వేడి చేయటం , కళ్ల మంటలు వంటి ఇబ్బందులు తొలగుతాయి.. గర్భిణీలకు వాంతులు , వికారం వంటి సమస్యలు ఎదురైనపుడు కొబ్బరి నీళ్లు తాగితే సత్వర ఫలితం ఉంటుంది..

‘స్వస్థ’ (ఆరోగ్యం సంబంధిత విషయాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/