మండే ఎండల నుంచి ఉపశమనం

ఆరోగ్యం- సంరక్షణ

Relief from Summer-
Relief from Summer-

గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల అందరూ ఇంటిపట్టునే ఉన్నందుకు ఎండ తీవ్రత అంతగా తెలియడం లేకపోవచ్చు.

అయితే ఎండలో తిరిగే వారు ఎవరైనా సరే ఒంట్లో నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్లకుండా చూసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. లేదంటే డీ హైడ్రేషన్‌కు గురై వడదెబ్బ తగులుతుందని అంటున్నారు.

Relief from Summer
Relief from Summer

వేసవిలో బయట ఎండకు ఎంత తిరిగినా ఇంట్లో నుంచి నీటిని బయటికి పోకుండా చూసుకుంటే చాలు, ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది.

అయితే ఎండల్లో తిరిగేవారు పుచ్చకాయలను ఎక్కువగా తినడం వల్ల లాభముంటుందని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయలను తినడం వల్ల మన శరీరానికి కేవలం నీరు మాత్రమే కాదు, పలు పోషకాలు కూడా అందుతాయి.

ముఖ్యంగా శక్తిని కోల్పోకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్లు, సుక్రోజు, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌లు అందుతాయి. దీంతో నీరసం, అలసట రాకుండా ఉంటాయి.

అలాగే పుచ్చకాయను తినడం వల్ల మన శరీరానికి నీరు కూడా పుష్కలంగా అందుతుంది. కనుక డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవచ్చు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/