నేడు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం జగన్‌

ప్రధాని మోడితో జగన్‌ భేటి

CM Jagan
CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపి కేబినెట్‌ సమావేశం ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం జగన్‌ ఢిల్లీ బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడిని కలుస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశముంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధాని మోదీని జగన్ కోరనున్నట్లు సమాచారం. అలాగే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విజభన హామీల అమలుతో పాటు కొన్ని కీలక అంశాల్ని జగన్ మరోసారి ప్రధాని మోడి దృష్టికి తీసుకొచ్చే అవకాశముంది. అలాగే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నిధులు సరిగా కేటాయించలేదని ప్రధాని దృష్టికి తేబోనున్నారు. ప్రధాని మోడితో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా జగన్ సమావేశం కాబోతున్నారని. రాష్ట్రానికి బడ్జెట్‌లో కేటాయింపులు, రెవెన్యూ లోటుపై చర్చించే అమిత్ షాతో ఛాన్స్ ఉంది. రాత్రి 7 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ నుంచి తిరుగు పయనమవుతారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/