గద్వాలలో దారుణం.. యువకుడి దారణ హత్య

మహబూబ్‌నగర్‌లో వివాహిత ఆత్మహత్య

Murder in Gadwal
Murder in Gadwal

గద్వాల: గద్వాల పట్టణానికి చెందిన బాణాల కార్తిక్ అనే యుకుడు దారుణ హత్తకు గురయ్యాడు. గద్వాల రూరల్ ఎఎస్‌ఐ వెంకట్రాములు తెలిపిన వివరాల ప్రకారం… రెండు రోజుల క్రితం కార్తిక్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. కార్తి క్ అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గద్వాల మండల మెలచేర్వు గ్రామ శివారులో పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో కార్తిక్ మృత దేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి గద్వాల సిఐ హన్మంత్ చేరుకొని విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ నబ్యూప్రేమ్ నగరు కాలనీలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య కు, కార్తిక్ హత్యకు సంబంధం ఉందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఫేస్‌బుక్ పరిచయం ఉందని, ఈ పరిచయమే వారిని బలిగొందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరి ఫేస్‌బు క్ పరిచయం కారణంగా కార్తిక్ తరుచుగా తన మిత్రుడి రవితో కలిసి మహబూబ్ నగర్‌కు వెళ్లి ఆమెను కలిసేవాడని తెలిపారు.

గద్వాలకు చెందిన సదరు మహిళ వివా హం మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో జరిగింది. రవి, కార్తిక్‌లతో సదరు మహిళ చనువుగా ఉండేదని, కొంత కాలంగా కార్తిక్ వేధిస్తున్నాడని రవికి ఆమె చెప్పిందని , దీంతోనే రవి కార్తిక్‌ను హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు, కార్తిక్ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రెండు రోజుల క్రితం కార్తిక్ హత్యకు గురైనట్లు విచారణలో తేలింది. పూర్తి విచారణ చేస్తున్నట్టు సిఐ హన్మంత్ తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/