ఈరోజు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

cm jagan

అమరావతీః సిఎం జగన్‌ విశాఖలో పర్యటించనున్నారు. ‘విజన్ విశాఖ’ కార్యక్రమం జరుగనుంది. ఈ తరుణంలోనే ‘విజన్ విశాఖ’ కార్యక్రమం సదస్సులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో ‘విజన్ విశాఖ’సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా విజన్‌ విశాఖ-ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ పేరుతో కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు సీఎం జగన్‌. అనంతరం యువతతో భేటీ కానున్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుడతారు సీఎం జగన్‌. అలాగే.. విశాఖ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్. అనంతరం భవిత పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించనున్నారు సీఎం జగన్.