కల్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు ఛాలెంజ్ విసురుతున్న టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు
కల్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు ఛాలెంజ్ విసిరారు టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అసెంబ్లీ ఎమ్మెల్యేల జాబితాలో కల్యాణదుర్గ నియోజకవర్గం నుండి సురేంద్రబాబు పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గ ప్రజల్లో సంబరాలు నెలకొన్నాయి.
ఎస్.ఆర్. కన్ స్ట్రక్షన్స్ అధినేత గా అనంతపురం జిల్లాలో అమిలి నేని సురేంద్రబాబు కు ఎంతో పేరు ఉంది. రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవలో తనదైన ముద్రవేసుకున్నారు. కరోనా సమయంలో తన సొంత డబ్బులతో జిల్లాలో తన టీమ్ తో శానిటైజర్లు, మాస్క్ లు, గ్లౌజులు, ఆక్సిజన్ సిలిండర్లు, పేదవాళ్ల ఇంటికి నిత్యావసరాలు, కరోనా మందుల కిట్లు వంటివి పంపించి తన గొప్ప మనసును చాటుకున్నారు. అలాగే అనంతపురంలో రైల్వే పాత బ్రిడ్జిని పడగొట్టి, ఒక్క ఏడాదిలోగా కొత్తది కట్టి రికార్డ్ సృష్టించిన కాంట్రాక్టర్ గా అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇక జిల్లాలో టీడీపీ పార్టీ సాధించిన విజయాల్లోను అలిమినేని పాత్ర ఉంది. ఇన్నాళ్లూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన అమిలినేని..ఇప్పుడు 2024లో నేరుగా కళ్యాణ దుర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలో చంద్రబాబు పలు దఫాలు జరిపిన సర్వేలో కూడా సీనియర్లను కాదని సురేంద్రబాబుకే ప్రజల మద్దతు లభించింది. దీంతో అధినేత చంద్రబాబు ఆయన పేరు ప్రకటించారు. గత రెండుసార్లు పార్టీ టికెట్ కోసం ట్రై చేసినప్పటికీ..పార్టీ సీనియర్లకు ఇచ్చింది. అయినప్పటికీ పార్టీ కోసం నిబద్దతగా పనిచేస్తూ వచ్చారు.
ఇప్పటివరకు కాంట్రాక్టరుగా ఉన్నాను, క్షణం తీరిక లేకుండా పరుగెత్తాను… ఇక చాలు, ఇక నుంచి మనసుకి ఆత్మ సంతృప్తి కలిగే పని చేయాలని భావించి, వ్యాపార వ్యవహారాలన్నింటికి రాజీనామా చేసి, స్వచ్ఛందంగా రాజకీయాల్లో అడుగు పెట్టానని సురేంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ దుర్గం మకాం మర్చి నూతనంగా ఇల్లు కూడా కడుతున్నారు. ఇక్కడ నుంచి ప్రతిరోజు నియోజకవర్గంలోనే ఉండి, ప్రజలకు అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. రహదారి సౌకర్యం లేక స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి రాయలప్పదొడ్డి నుంచి బొమ్మగానిపల్లి వరకు 2 కిలోమీటర్లకి పైగా రోడ్డుని తన సొంత ఖర్చులతో వేయిస్తున్నారు. కళ్యాణదుర్గానికి ఐదేళ్ల తర్వాత మీరేం చేశారు? అని అడగండి, అప్పుడు సమాధానం చెబుతానని ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ప్రజలు సైతం ఒక్క ఛాన్స్ సురేంద్ర బాబు కు ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.