నిడదవోలు నుంచి జనసేన నేత కందుల దుర్గేష్ పోటీ

జనసేన నేత కందుల దుర్గేష్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చింది. రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేయాలనీ ముందు నుండి భావించారు. కానీ టిడిపి పొత్తు కారణంగా ఈ స్థానం టిడిపి నేత కు దక్కడం తో కందుల దుర్గేష్ నిడదవోలు నుండి బరిలోకి దిగబోతున్నాడు.

ఈ విషయాన్నీ ఆయనే స్పష్టం చేసారు. పొత్తు ధర్మంలో భాగంగా అధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యంగా భావించి నిడదవోలులో పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. వీరవరంలో జనసేన ముఖ్య నేతలతో మాట్లాడిన ఆయన.. ‘అవినీతి, అరాచక పాలనను గద్దె దింపేందుకు టీడీపీ-జనసేన మైత్రీ విజయవంతం కావాలి. వ్యూహ, ప్రతివ్యూహాలను పార్టీ పెద్దలకు వదిలి ఎన్నికల బరిలో నిలుస్తున్నా’ అని తెలిపారు.