హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. నీతి అయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ ..అక్కడే అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు సమస్యలను అమిత్‌షా దృష్టికి జగన్ తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలపాలని రిక్వస్ట్ చేశారు. ఏపీ,తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవచూపాలన్నారు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లో పొందపరిచిన ఆస్తుల విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను కూడా వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను , కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను సైతం కలిశారు.