విమాన ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడి ఆరా

ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌తో మాట్లాడిన ప్రధాని

pm modi
pm modi

తిరువనంతపురం: కేరళలో జరిగిన విమాన ప్రమాదం ఘటనపై ప్రధాని మోడి ఆరా తీశారు. ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌తో ప్ర‌ధాని మాట్లాడారు. ప్ర‌మాద ఘ‌ట‌న గురించి సీఎం పిన‌ర‌యి ప్ర‌ధానికి వివ‌రించారు. కోజికోడ్‌, మ‌ల‌ప్పురం జిల్లా క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారులు, ఐజీ అశోక్ యాద‌వ్ విమానాశ్ర‌యానికి చేరుకున్నార‌ని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. విమాన ప్ర‌మాదం బాధ‌కు గురిచేసింద‌ని ప్ర‌ధాని అన్నారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లంలోనే ఉన్న‌ట్లు బాధితుల‌కు కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు, ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/