మండలి చైర్మన్‌ షరీఫ్‌కు పాలాభిషేకం

రాజధానిలో 37వ రోజుకు చేరిన నిరసనలు

Shariff Mohammed Ahmed
Shariff Mohammed Ahmed

అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా గ్రామాల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు 37వ రోజుకు చేరుకున్నాయి. మండలిలో వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ తీర్మానం వేయడంతో అమరావతి ప్రజల హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులు వీగిపోవడంతో తదుపరి ఉద్యమకార్యాచరణను జేఏసీ రూపొందించింది. ఉదయం 9 గంటలకు మండలి చైర్మన్ షరీఫ్‌కు పాలాభిషేకం చేయనున్నారు. అలాగే ఈరోజు నుంచి మందడంలో అసైన్డ్ రైతులు 24 గంటల పాటు నిరవదిక దీక్ష చేయనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/