రామోజీరావుకు చంద్రబాబు శుభాకాంక్షలు

నేడు పుట్టినరోజును జరుపుకుంటున్న రామోజీరావు

Chandrababu
Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు రామోజీరావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, స్వయం కృషితో ఎన్నో సంస్థలకు అధిపతిగా ఎదిగి.. వేలాదిమందికి ఉపాధిని కల్పించిన శ్రీ రామోజీరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పత్రికాధిపతిగా సామాజిక విలువలను పెంపొందించడమే కాకుండా, సాహితీ వికాసానికి, తెలుగు భాషాభ్యుదయానికి, రైతాంగానికి ఆయన చేస్తోన్న సేవలు ప్రశంసనీయం. భగవంతుడు రామోజీరావుగారికి సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/