అలా చేస్తే లక్షల మందికి ఇళ్లు వస్తాయి

భూసేకరణ వివాదంపై స్పందించిన నారా లోకేశ్‌

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: సిఎం జగన్‌ ప్రభుత్వంపై టిడిపి నేత నారా లోకేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న భూసేకరణ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. పేదవాళ్లకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కుని తిరిగి పేదలకు పంచుతాననడం జగన్ రివర్స్ టెండరింగ్ కు పరాకాష్ట అని విమర్శించారు. పథకాల పేరు మార్పు కోసం పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇవ్వండి… లక్షల మంది పేదలకు ఇళ్లు వస్తాయి అంటూ వ్యాఖ్యానించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/