విజేతలు ఎవరో !?

పలువురు అభిప్రాయం వ్యక్తం..

విజేతలు ఎవరో  !?

బిగ్ బాస్ విజేతను నిర్ణయించేది.. ప్రేక్షకులు.

కాని తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ అలా జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు. అంటూ బిగ్ బాస్ ను రెగ్యులర్ గా క్లోజ్ గా ఫాలో అయ్యే విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి ఆటను రసవత్తరంగా మార్చాలనే ఉద్దేశ్యంతోబ్యాచ్ ను కంటిన్యూ చేస్తే గత సీజన్ మాదిరిగా ఈ సీజన్ కు మంచి రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ టీం భావించినట్లుగా తెలుస్తోంది.

అందుకే మొదట్లోనే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను బయటకు పంపించేశారు.

దేవి మరియు కుమార్ సాయి వంటి వారిని ఎలా బయటకు పంపిస్తారు అంటూ విమర్శలు వ్యక్తం అయినా కూడా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరియు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ మరియు రన్నరప్ గా లాస్య నిలిచే అవకాశం ఉందంటున్నారు.

టాప్ 5 లో వీరిద్దరితో పాటు అఖిల్.. సోహెల్ మరియు అవినాష్ లు చేరబోతున్నారు. ర

ాబోయే మూడు వారాల్లో మోనాల్.. అరియానా మరియు హారిక ఎలిమినేట్ అవ్వబోతున్నారు అంటున్నారు. 99 శాతం అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడు అంటున్నారు. 

అభిజిత్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మామూలుగా లేదు.

ఆయనకు గతంలో కౌశల్ కు ఉన్నంత స్థాయిలో సోషల్ మీడియా బలం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/