ఎపిలో ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

జనవరి 28 నుంచి 31 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

career
career

Amaravai: ఐసెట్‌కు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. జనవరి 25 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు.. కాగా జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.. జనవరి 31 సాయంత్రం 6 గంటల తర్వాత వెబ్‌ అప్షన్లు మార్చేందుకు ఎలాంటి వీలు ఉండదు.. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2వతేదీ సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఫీజు, జనరల్‌, బిసి అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి హెల్ప్‌నెంబర్లు:
810 687 6345,
810 657 5234,
799 668 1678. ను సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/