వైజాగ్ లో జనసేన సభ ఫై టెన్షన్ వాతావరణం ..

అక్టోబర్ 31 న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద జనసేన భారీ బహిరంగ సభ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జనసేన నేతలు సభ వేదిక కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఈ తరుణంలో పోలీసులు నేతలకు పెద్ద షాక్ ఇచ్చారు. సభా వేదికను మార్చాలని వారు ఆదేశించారు. జనసేన నాయకులు మాత్రం అక్కడే సభా నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ జరిపి తీరుతామని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉక్కు ప్రైవేటీకరణకు అనుకులమా..? ప్రతికూలమా..? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు ఒక రూల్.. ప్రభుత్వానికి ఒక రూల్ ఉంటుందా అని నిలదీశారు.

మొన్నటి వరకు జనసేన బిజెపి కి సపోర్ట్ గా ఉంది కాబట్టే..విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్పందించలేదని అన్నారు. ఇక ఇప్పుడు బిజెపి నిర్ణయాన్ని తప్పు పడుతూ..విశాఖ ఉక్కు కోసం పోరాటానికి దిగితే అడ్డుకుంటారా అని జనసేన కార్యకర్తలు ప్రశ్నింస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరినా.. కేంద్రంలో మార్పు రాలేదు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకే అడుగులు పడుతున్నాయి. ఈ తరుణంలో పవన్ కల్యాణే రంగంలోకి దిగుతున్నాడు.