పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. మరోవైపు లోకేశ్ కూడా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ట్వీట్లో అభిలషించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/