స్వదేశానికి బయల్దేరిన 153 మంది భారతీయులు

బ్యాంకాక్: వందే భారత్ మిషన్‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు స్వదేశానికి బయల్దేరారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ… ‘వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇది థాయ్‌లాండ్ నుంచి ఇండియాకు వస్తున్న 12వ విమానం. ఏఐ 335 విమానం మంగళవారం బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి 153 ప్రయాణికులతో బయల్దేరింది. ప్రవాసుల తరలింపులో సహకరిస్తున్న థాయ్‌లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, థాయ్ ఇమ్మిగ్రేషన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియాకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/