అప్పుడు మోడి చెప్పిందే..నేను చెబుతున్నా

యువతకు ఉద్యోగాలు కావాలని మోడి వ్యాఖ

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: ప్రధాని మోడి హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం ఓ ట్విట్‌ చేశారు. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడి ఉన్న సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్‌కు సంబంధించిన‌ స్క్రీన్‌ షాట్‌ను తాజాగా చిదంబరం పోస్ట్ చేసిన విమర్శలు గుప్పించారు. 2013లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలో చిక్కుకుందని, యువతకు ఉద్యోగాలు కావాలని మోడి అన్నారు. సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు కేటాయించాలని మోడి అప్పట్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌నే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది అదే అంటూ విమర్శలు గుప్పించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/