ఈనాడు రామోజీరావు ఫై కేసు నమోదు

ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు ఫై CID కేసు నమోదు చేసింది. మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి. జగన్నాథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్ లపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 42O, 467, 120-8, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.

కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ ను చేర్చారు. మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారని, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించి, బలవంతంగా లాక్కున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. తన తండ్రికి మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని తెలిసి అపాయింట్ మెంట్ కోరగా చాలాకాలం రామోజీరావు తమను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. 29 సెప్టెంబర్ 2016లో రామోజీరావును కలిసిన సమయంలో బెదిరించి తన వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవల తమ షేర్‌ హోల్డింగ్‌పై స్పష్టత రావడంతోనే ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి తెలిపారు. తిరిగి 2 అక్టోబర్ 2016న తన తండ్రి వాటను తన పేరిట మార్చాలని సోదరుడికి ఏ ఇబ్బంది లేదని చెప్పాడు. అఫిడవిట్ పై సంతకం చేయాలని రామోజీరావు కోరడంతో, ఓ పేజీ ఖాళీగా ఉందని సంతకం చేయనని చెప్పగా తుపాకీతో ఆయన తనను బెదిరించి సంతకం చేయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు.