బిఆర్‌ఎస్‌ ఆకుల లలిత రాజీనామా

పార్టీలో ఎమ్మెల్యేల పాలన సాగుతోందని విమర్శ

akula-lalitha-resigns-from-brs

హైదరాబాద్‌ః నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సిఎం కెసిఆర్‌కు రాజీనామా లేఖ రాశారు.

బిఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోందని ఆకుల లలిత ఈ సందర్భంగా విమర్శించారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తనను బాధించడంతో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఆకుల లలిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.