విజయానికి చేరువగా..

జార్జియాలో బైడెన్‌కు ఆధిక్యం- కొద్దిగంటల్లో ఉత్కంఠకు తెర

Joe-Biden-Towards success
Joe-Biden-Towards success

Washington: అమెరికా ఎన్నికల ఫలితాలు ఓ కొలిక్కి రాబోతున్నాయి. కొద్దిగంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.. దాదాపు 45 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్టోరల్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది..

తాజా పరిస్థితిని బట్టి డెమోక్రాట్‌ అధ్యక్ష అభ్యర్తి బైడెన్‌కు అనుకూలంగా 264 ఎలక్టోరల్‌ ఓట్లు లభించాయి..

మ్యాజిక్‌ ఫిగర్‌ 270కు చేరుకోవాలంటే మరో 6 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించాల్సి ఉంటుంది. అయితే బైడెన్‌ అధ్యక్షునిగా ఎన్నిక కావటం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా జార్జియాలో ఉన్న 16 ఎలక్టోరల్స్‌లో బైడెన్‌ ఆధిక్యంలో ఉండటం ఆయనకు కలిసొచ్చేలా ఉంది.. ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు 99 శాతం పూర్తయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/