భారత్‌లో 24 గంటల్లో 8,909 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 207,615

భారత్‌లో 24 గంటల్లో 8,909 కరోనా కేసులు
corona cases- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 8,909 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 217 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 207,615 కి చేరగా, మృతుల సంఖ్య 5,815 కి చేరుకుంది. 1,01,497 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 100,303 మంది కోలుకున్నారు. ఈమేరకు రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/