హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్
నేడు మంత్రి హరీశ్‌రావు 49వ పుట్టినరోజు
హైదరాబాద్: నేడు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు ఈసందర్భంగా మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికశాఖ మంత్రి, డైనమిక్, కష్టజీవి.. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ప్రజా సేవలో సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నా బావా అని అన్నారు. రాజకీయంగా గానీ, ప్రభుత్వ ఫోరంలలో గానీ మీతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. కాగా హరీశ్‌కు రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/