పేదలను ఆదుకునేందుకు రూ.65 వేల కోట్లు అవసరం

రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్ లో రఘురాం రాజన్ 

Raghuram Rajan - Rahul
Raghuram Rajan – Rahul

న్యూఢిల్లీ :దేశంలో కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తో దెబ్బతిన్న భారతదేశంలోని పేదలకు సహాయం చేయడానికి సుమారు రూ .65,000 కోట్లు అవసరమవుతాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త, ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ రఘురామ్ రాజన్ తన అభిప్రాయాలను వెల్లడించారు .కరోనావైరస్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం గురించి మాట్లాడిన దీర్ఘకాలిక లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థ అంత మంచిది కాదని సూచించారు. “పేదలకు సహాయం చేయడానికి ఎంత డబ్బు అవసరం అని రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు… తక్షణ సంక్షేమం కోసం రూ .65,000 కోట్లు అవసరమని, ఇది పేదల ఆకలి దప్పులు తీర్చడం కోసం మాత్రమే ఖర్చు చేయాలని రఘురామ్ రాజన్ సమాధానం ఇచ్చారు. అంతేకాక “లాక్‌డౌన్ ఎత్తివేయడంలో ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించాలని, కోట్లాది మంది జనాభా కలిగిన. భారతదేశంలో, ఎక్కువ కాలం ప్రభుత్వాలు ప్రజలకు ఆహార సదుపాయాలు కల్పించగలిగే సామర్థ్యంతో లేవని, కరోనా ఉన్నవారిని ఎప్పటికప్పుడు గుర్తించి వారిని ఐసోలేషన్ ద్వారా వేరుచేసి అంచలంచెలుగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ఆయన సూచించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి ;https://www.vaartha.com/news/sports/