ఈ ప్రభుత్వాల వల్ల తెలంగాణకు శాపం: రేవంత్ రెడ్డి

Rewanth Reddy

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాల పై మండిపడ్డారు. తెలంగాణ కు ఈ ప్రభుత్వాల వల్ల తీరని అన్యాయం జరుగుతుందని ఆయన విమర్శించారు. 2014 సంవత్సరం నుండి 35 ప్రతిష్ఠాత్మక సంస్థలు అంటే.. ఐఐటీ,ట్రిపుల్ ఐటీ,ఐఐఎస్ఈఆర్ ఎన్ఐడీ వంటివి స్థాపిస్తే.. తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా రాలేదని ఆయన తెలిపారు. బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాల పాలన నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాల వల్ల తెలంగాణాకు శాపమని ఆవేదన వ్యక్తపరిచారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి. https://www.vaartha.com/andhra-pradesh/