దేశంలో కొత్తగా 31,443 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్త క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 31,443 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదున‌మోద‌య్యాయ‌ని, దేశంలో 118 రోజుల క‌నిష్ఠానికి రోజు వారీ కేసులు చేరాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. రిక‌వ‌రీ రేటు 97.28 శాతంగా ఉంద‌ని పేర్కొంది. దేశంలో ప్ర‌స్తుతం క్రియాశీల కేసులు 4,31,315గా ఉన్నాయ‌ని, 109 రోజుల క‌నిష్ఠానికి యాక్టివ్ కేసులు చేరాయ‌ని వివ‌రించింది.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 43,40,58,138 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,40,325 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/