మంత్రి కొండా సురేఖఫై ఈసీకి బిఆర్ఎస్ పిర్యాదు

Will participate in AP election campaign: Minister Konda Surekha

ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేసారంటూ బిఆర్ఎస్ ఈసీకి పిర్యాదు చేసింది. కులాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆమె చేసిన ప్రసంగంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. గురువారం సిద్దిపేట అంబేద్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో జరిగిన రోడ్ షో లో కొండా సురేఖ మాట్లాడుతూ..ఒక్కొక్కరూ పది ఓట్లు వేసైనా సరే.. మన అభ్యర్థిని గెలిపించాలని’ పార్టీ కాడర్‌కు, బీసీ వర్గాలకు మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.

అలాగే కులాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆమె చేసిన ప్రసంగంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మంత్రి కొండా సురేఖ చేసిన ప్రసంగాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే రెండు సార్లు ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆమెను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది కూడా. అయినా ఆమె తన ప్రసంగాలను ఆదే విధంగా కొనసాగిస్తున్నారు అని బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.