జైలులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకు క్లర్క్ పని

కోర్టు తీర్పుల సంక్షిప్తీకరణ, రికార్డుల సంకలనం బాధ్యతలు అప్పగింత

navjot-singh-sidhu-to-work-as-a-clerk-at-jail

పాటియాలా : కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలు అధికారులు ఆయనకు క్లర్క్ పని అప్పగించారు. చేయాల్సిన పనులపై మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం సిద్ధూ స్వయంగా ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. సుదీర్ఘంగా ఉండే కోర్టు తీర్పులను సంక్షిప్తీకరించడం, జైలు రికార్డులను సంకలనం చేయడాన్ని సిద్ధూ నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు.

జైలు నిబంధనల కింద మొదటి మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. కనుక ఆ కాలంలో వేతనం చెల్లించరు. శిక్షణ ముగిసిన తర్వాత అప్పుడు రోజువారీ రూ.40 నుంచి రూ.90 వరకు వేతనానికి అర్హత పొందుతారు. సిద్ధూ చూపించే నైపుణ్యాల ఆధారంగా ఇందులో ఎంత ఇవ్వాలన్నది జైలు అధికారులు నిర్ణయిస్తారు. హై ప్రొఫైల్ ఖైదీ కావడంతో బరాక్ నుంచే క్లర్క్ పనులను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్ నుంచి బయటకు రాకుండా ఆయన దగ్గరకే రికార్డులు పంపించనున్నారు. సిద్ధూ ఉండే సెల్ సమీపంలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/