దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటివరకు వెయ్యి లోపు కేసులు నమోదు కాగా.. గడిచిన వారం రోజులుగా ఆ సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో 1862 మంది కరోనా వైరస్‌ నుంచి బయటపడ్డారు. అదే సమయంలో మరో 30 మంది మహమ్మారికి బలైయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,22,223కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,522 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరింది. దేశంలో రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా.. మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 1,87,71,95,781 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/