ఏపీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APVVP) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ భర్తీ చేసింది. రెగ్యులర్ ప్రతిపదికన ఈ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 453 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

గైనకాలజీ విభాగంలో 269 ఖాళీలు ఉన్నాయి.
పీడియాట్రిక్స్ – 11
అనెస్తీషియా – 64

జనరల్ మెడిసిన్ – 30

జనరల్ సర్జన్ – 16

ఆర్థోపెడిక్స్ – 12

పాథాలజీ – 05

ఆప్తాల్మాలజీ – 09

రేడియాలజీ – 21

సైకియాట్రీ – 02

డెర్మటాలజీ – 06

ఈఎన్టీ(ENT) – 08

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/