ప్ర‌ధాని మోడీకి భూటాన్ అత్యున్న‌త పౌర పుర‌స్కారం

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. భూటాన్ అత్యున్న‌త పౌర పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. భూటాన్ జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా న‌డాగ్ పెల్ గి ఖొర్లో అవార్డును ప్ర‌క‌టించారు. భార‌త ప్ర‌ధాని మోడీకి త‌మ దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాన్ని ఇవ్వ‌డానికి సంతోషిస్తున్న‌ట్లు భూటాన్ ప్ర‌ధాని లోటే షేరింగ్ తెలిపారు. సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. భూటాన్ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం కూడా ఈ అవార్డు ప్ర‌క‌ట‌న‌పై ఫేస్‌బుక్‌లో ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

భూటాన్ పౌర పుర‌స్కారాన్ని అందుకోవ‌డానికి మోడీజీ అర్హుడ‌ని ఆ దేశ పీఎంవో తెలిపింది. భూటాన్ ప్ర‌జ‌లు కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌ధాని మోడీ ఓ గొప్ప‌, ఆధ్మాతిక మావ‌న‌తావాది అని, వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న్ను గౌర‌వించేందుకు ఆసక్తిగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని కార్యాల‌యం పేర్కొన్న‌ది. మోడీజీ హ‌ద్దులు లేని స్నేహాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని, క‌రోనా మ‌హ‌మ్మారి వేళ కూడా వారు అందించిన స‌హ‌కారాన్ని మ‌ర‌వ‌లేమ‌ని భూటాన్ పీఎం తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/