దేశంలో కొత్తగా 18,840 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు..1,25,028

india- coronavirus

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 18,840 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 43 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. మ‌రో 16,104 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య‌ 1,25,028కి చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 4.14 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 198 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జ‌రిగింది. దేశంలో శుక్రవారం 12,26,795 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,65,36,288కు చేరింది. మరో 4,54,778 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 7,91,063 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,463 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 55,95,71,183కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,71,277 మంది మరణించారు. ఒక్కరోజే 4,87,206 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,26,40,181కు చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/