సహ ఉద్యోగినిపై లైంగిక వేధింపులు..అటవీశాఖాధికారికి 8 ఏళ్ల జైలు

జైలు శిక్షతోపాటు రూ. 12 వేల జరిమానా విధింపు

Jail
Jail

రాజమహేంద్రవరంః సహచర ఉద్యోగినిపై అత్యాచారయత్నం చేసిన అటవీశాఖ అధికారికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి పీఆర్‌ రాజీవ్‌ తీర్పునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన మల్లి వెంకటేశ్వరరావు 2017లో రాజమహేంద్రవరంలోని ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డివిజినల్ కార్యాలయంలో అటవీశాఖ అధికారిగా ఉన్నారు.

అదే ఏడాది జూన్‌లో సహోద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో పలుమార్లు వాదనలు విన్న ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు నిందితుడు వెంకటేశ్వరరావును దోషిగా నిర్ధారించి 8 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 12 వేల జరిమానా విధించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/