దేశంలో కొత్తగా 188 కరోనా కేసులు

India – corona virus

న్యూఢిల్లీః దేశంలో కొత్తగా 188 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,46,77,647కు చేరింది. ఇందులో 4,41,43,483 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,30,696 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 3,468 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో వైరస్‌ వల్ల ఎవరూ మరణించలేదని స్పష్టం చేసింది.

కాగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.07 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 90,529 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ప్రకటించింది. మంగళవారం 1,34,995 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/movies/