‘యువ గళం’గా పేరుతో లోకేశ్‌ పాదయాత్ర

జనవరి 27న కుప్పం నుంచి 4 వేల కిలోమీటర్లు కొనసాగనున్న యాత్ర

nara-lokesh-padayatra-name-is-yuva-galam

అమరావతిః టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు ‘యువ గళం’ అనే పేరును ఖరారు చేశారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. 100 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. యువత, మహిళలు, రైతుల సమస్యలను ప్రతిబింబించేలా పాదయత్రను నిర్వహించనున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా పాదయాత్ర కొనసాగనుంది. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పాదయాత్ర పోస్టర్ ను విడుదల చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/