80 మిస్సైళ్ల‌తో ఉక్రెయిన్ పై రష్యా దాడి‌..

న్యూక్లియ‌ర్ ప్లాంట్ వ‌ద్ద విద్యుత్తు స‌ర‌ఫ‌రా కట్‌

more-than-80-russian-missiles-have-been-fired-at-cities-across-ukraine

కీవ్‌ః ఉక్రెయిన్ మరోసారి రష్యా దాడిచేసింది. దాదాపు 80 క్షిప‌ణులతో తాజాగా దాడి చేసింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఉక్రెయిన్ పై ర‌ష్యా పెను దాడి చేసింది. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది. రాత్రికి రాత్రే ఆ మిస్సైళ్ల‌ను వ‌దిలిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా మిస్సైల్ అటాక్‌ లో 9 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. జ‌పొరిజియా న్యూక్లియ‌ర్ ప్లాంట్ వ‌ద్ద విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.

కాగా, తాజా దాడిలో ర‌ష్యా 8 డ్రోన్ల కూడా వాడిన‌ట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ పేర్కొన్న‌ది. లివివ్ ప‌ట్ట‌ణంలో అయిదుగురు మృతిచెందారు. భారీ శిథిలాల కింద ప్ర‌జ‌లు చిక్కుకున్నారు. కీవ్‌లోని వెస్ట్ర‌న్‌, స‌ద‌ర‌న్ జిల్లాల్లో ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసులు ఊపందుకున్నాయి. కీవ్ ప‌ట్ట‌ణంలో కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేదు.