ఏపీలో మానసిక వైకల్య బాధితులకు పెన్షన్లు..

Pensions for mentally disabled victims in AP

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మానసిక వైకల్య బాధితులకు పెన్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. మానసిక వైకల్య బాధితులకు డాక్టర్స్ జారీచేసిన తాత్కాలిక ధ్రువపత్రాల ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మానసిక వైకల్య బాధితులకు తాత్కాలిక ధ్రువపత్రాలు ఆధారంగా డిసెంబర్లో పెన్షన్లు మంజూరు కానున్నాయి.

మరోపక్క అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి సైతం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వారిలో ఆనందం నింపారు. సెప్టెంబర్ 30వ తేదీ కల్లా అంగన్‌వాడీ సూపర్‌‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్‌‌వైజర్ల పోస్టుల భర్తీకి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించామని.. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని తెలిపారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్‌షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. పరీక్షల ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్‌వైజర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.