షర్మిలకు పదవి ఇవ్వకపోవడమే అన్యాయమా..? – సజ్జల

ఏపీలో జగన్ vs షర్మిల గా మారింది. రీసెంట్ గా షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తో ఏపీలో రాజకీయాలు మరింత మారాయి. షర్మిల వరుసగా ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈరోజు నెల్లూరు సమావేశంలోను కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పదవులు ఇవ్వకపోవడమే తాము చేసిన అన్యాయమా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘షర్మిలకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి. ఏపీ రాజకీయాలపై ఆమెకు అవగాహన లేదు. షర్మిల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు చంద్రబాబు స్క్రిప్ట్ రాస్తున్నారేమో? జగన్ను వేధించిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం విచిత్రంగా ఉంది’ అని ఆయన మండిపడ్డారు.

ఇక రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడం కోసమే పార్టీలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సజ్జల స్పష్టం చేసారు. విజయవాడలో YCP కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ‘ఈనెల 27 నుంచి వరుస సభలు ఉంటాయి. ఎల్లుండి భీమిలిలో సీఎం జగన్ సభ ఉంటుంది. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు అధికారం కాదు.. బాధ్యత. YCPలో ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎవరైనాసరే కార్యకర్తలే’ అని వ్యాఖ్యానించారు.