దేశంలో కొత్తగా 10,753 కరోనా కేసులు

corona virus

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో 10,753 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 27 మంది కరోనాకు బలయ్యారు. కొవిడ్ కారణంగా ఇప్పటివరకు 5 లక్షల 31 వేల 91 మంది మరణించారు. ఢిల్లీలో ఆరు మరణాలు, మహారాష్ట్రలో నాలుగు, రాజస్థాన్‌లో మూడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ , ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయ్యాయి.

తాజా కేసులతో కలిపి మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఏప్రిల్ 14 శుక్రవారంతో పోలిస్తే కాస్త కేసుల తగ్గాయి. 11,000 పైగా కేసులు శుక్రవారం నమోదయ్యాయి. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే మాస్క్ ను కంపల్సరీ చేశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.78గా, రికవరీ రేటు 98.69 వద్దగా ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా కొవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించారు.