కులాన్నే చూసి ఉంటే పళనిస్వామిని సిఎం చేసే దాని కాదుః శశికళ

ఆహ్వానం వస్తే ఓపీఎస్ మహాసభకు వెళ్తానన్న జయ నెచ్చెలి

had-i-seen-caste-i-would-not-have-brought-eps-as-cm-sasikala

చెన్నైః తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కనుక కులాన్నే చూసి ఉంటే ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ని ముఖ్యమంత్రిని చేసి ఉండేదానిని కాదని అన్నారు. చెన్నైలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 24న తిరుచ్చిలో పన్నీర్ సెల్వం(ఓపీఎస్) నిర్వహిస్తున్న మహాసభకు వెళ్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ఇందులో దాయాల్సినది ఏముందని, ఆహ్వానం అందితే వెళ్తానని అన్నారు.

ముందైతే ఆహ్వానం రానివ్వండని అన్నారు. ఆ తర్వాత అందరికీ తనను అర్థం చేసుకునే కాలం వస్తుందని అన్నారు. అయితే, ఈ విషయాన్ని తాను పన్నీర్ సెల్వాన్ని ఉద్దేశించి చెప్పడం లేదని, అందరి గురించి చెబుతున్నానని అన్నారు. తనకు కులమత ప్రాంతీయ భేదాలు లేవని శశికళ స్పష్టం చేశారు.