చిత్తూరు జిల్లాలో పదిమంది విద్యార్థులకు కరోనా

విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారన్న వైద్యులు

చిత్తూరు : చిత్తూరు జిల్లా కరబలకోట మండలంలోని ఓ విద్యాసంస్థలో చదువుకుంటున్న పదిమంది విద్యార్థులు సహా 11 మంది కరోనా బారినపడ్డారు. విద్యార్థులకు కరోనా సోకినట్టు గుర్తించిన స్థానిక వైద్యురాలు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కరబలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి అనూహ్య విద్యార్థులకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని అనూహ్య తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/