చిత్రసీమలో మరో విషాదం : మమ్ముట్టి తల్లి కన్నుమూత

malayala-star-hero-mammootty-mother-passed-away

చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఎవరొకరు కన్నుమూస్తునే ఉన్నారు. తాజాగా మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్‌(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.

ఫాతిమా ఇస్మాయిల్‌ మరణంతో మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ సెలబ్రెటీలు మమ్ముట్టి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. మమ్ముట్టి తల్లి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కొట్టాయం సమీపంలోని చెంపులో నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది.