వైస్సార్సీపీ ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి క్లారిటీ

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైస్సార్సీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేల ఫై వేటు వేసింది. ఇదే తరుణంలో 40 ‘మంది వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ చెప్పడం తో ఆ 40 మంది ఎవరా అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలాగే పలువురు మారుతున్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఆలా మారిపోతున్న వారిలో మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతుండడం తో..ఆయన క్లారిటీ ఇచ్చారు.

విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్లు ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోనని అన్నారు. జగన్ కుటుంబంతో తమ కుటుంబానికి చాలా కాలంగా అనుబంధం ఉందని… జగన్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందని అన్నారు.

జగన్ కు మద్దతుగా తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండు సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తర్వాత జగన్ తమను పిలిచి ఆ సీటును ఇచ్చారని తెలిపారు. తనకు ఏ సాయం కావాలన్నా ముందుగా జగన్ నే సంప్రదిస్తానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు.