దేశంలో వరుసగా రెండో రోజు 3 వేలు దాటినా కరోనా కేసులు

దేశంలో మరోసారి కరోనా బుసలు కొడుతుంది. గత మూడు నెలలుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో అంత హమ్మయ్య అనుకున్నారు. కానీ గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజలను ఆందోళన కు గురి చేస్తున్నాయి. తాజాగా దేశంలో రెండో రోజు మూడు వేల మార్క్ ను క్రాస్ చేసాయి కొత్త కేసులు. ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 700 కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రయాణకులను పరీక్షించేందుకు థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వందమంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే వారికి మాత్రం కరోనా పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. మరోపక్క కేంద్రం కూడా పలు రాష్ట్రాలను అలెర్ట్ జారీ చేసింది.