కవిత జోలికి వస్తే తెలంగాణ అట్టుడికిపోతుంది – దానం నాగేందర్

ఎమ్మెల్సీ కవిత జోలికి వస్తే తెలంగాణ అట్టుడికిపోతుంది..బీజేపీ లీడర్స్ ని హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు దానం నాగేందర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితక్కను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా ? అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలఫై యావత్ బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం టీచర్ల సమావేశంలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో బిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు బండి సంజయ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ ఫై పిర్యాదు లు చేస్తున్నారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆద్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో అందోళనలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బిఆర్ఎస్ కార్యకర్తలు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని , ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ని మోడీ రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నాడని ఆరోపించారు. బండి సంజయ్ మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కావాలనే మోడీ, కవిత పై కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఈడీ, సీబీఐ లను మోడీ వాడుకుంటున్నాడని అన్నారు. కవిత జోలికి వస్తే తెలంగాణ అట్టుడికిపోతదన్నారు.

ఇక తెలంగాణలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ ..ఎమ్మెల్సీ కవిత ఫై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించరేంటి అని ప్రశ్నించారు మంత్రి సత్యవతి రాథోడ్. బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళసై స్పందించాలి అని ఆమె ఉద్దేశం ఏంటో చెప్పాలి..? అని సత్యవతి డిమాండ్ చేసారు.