పిల్లలకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను..బైడెన్ సరదా వ్యాఖ్యలు

అద్భుతమైన ఐస్‌క్రీమ్‌ దొరికే ప్రాంతాలు నాకు తెలుసు.. మీలో ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి..బైడెన్

Biden tells kids he knows ‘great ice cream places’

వాషింగ్టన్‌ః అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఐస్‌క్రీమ్స్‌ అంటే మహా ఇష్టం. ఐస్‌క్రీమ్స్‌ తింటూ అప్పుడప్పుడూ మీడియా కంట పడుతుంటారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అసలు విషయాన్ని పక్కనపెట్టి ఐస్‌క్రీమ్స్‌ గురించి మాట్లాడారు.

ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం (ఐఆర్‌‌ఏ) తొలి వార్షికోత్సవంలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పిల్లలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వైట్‌హౌస్‌ దగ్గర్లో అద్భుతమైన ఐస్‌క్రీమ్‌ దొరికే ప్రాంతాలు నాకు తెలుసు. మీలో ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి” అని సరదాగా అన్నారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన వారందరూ నవ్వేశారు. తర్వాత ఐఆర్‌‌ఏ గురించి మాట్లాడటం కొనసాగించారు.

కాగా, బైడెన్‌ ఐస్‌క్రీమ్ ప్రియులు. గతేడాది మధ్యంతర ఎన్నికల ప్రచార సమయంలో ఐస్‌క్రీమ్ తింటూ కనిపించారు. మరోవైపు ఓ ఐస్‌క్రీమ్‌ బ్రాంచ్‌లో బైడెన్‌ కోసమే ప్రత్యేకమైన ఫ్లేవర్‌‌ను తయారు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.