టిడిపి పతనానికి ఇది ప్రారంభం మాత్రమేః విజయసాయిరెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంలేదన్న టిడిపి హైకమాండ్… కాసాని రాజీనామా

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కావడం తెలంగాణలో ఆ పార్టీ పోటీచేసే అంశంపై తీవ్ర ప్రభావం చూపింది. తెలంగాణ టిడిపిలో తీవ్ర కల్లోలం చెలరేగింది. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో…. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయరాదని టిడిపి హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం, కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.

దీనిపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తెలంగాణలో అసలు ఎక్కడా పోటీ చేయరాదని టిడిపి నిర్ణయించుకోవడం 1982 తర్వాత ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ పతనానికి ఇది ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు. “నా అంచనా ప్రకారం 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పూర్తిగా నిష్క్రమిస్తుంది” అని విజయసాయిరెడ్డి వివరించారు.