నేడు మహానాడులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి ఈరోజు. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు , నందమూరి అభిమానులు , టీడీపీ శ్రేణులు జయంతి వేడుకలు జరుపుతున్నారు.

ఇక రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో నేడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరపనున్నారు. ఉదయం 8 గంటలకు వేమగిరి మహానాడు ప్రాంగణం నుండి టీడీపీ అధినేత చంద్రబాబు ర్యాలీ నిర్వహించనున్నారు. వేమగిరి నుండి బొమ్మూరు, మోరంపూడి , ఆర్టీసి బస్టాండ్ , స్టేడియం రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు చంద్రబాబు ర్యాలీ ఉండనుంది. కోటిపల్లిబస్టాండ్ వద్ద ఉన్న ఏన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న చంద్రబాబు… తిరిగి వేమగిరి మహానాడు ప్రాంగణానికి చేరుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో విశ్రాంతి తీసుకోనున్నారు. సాయంత్రం 3 గంటలకు వేమగిరి జంక్షన్ సమీపంలో వంద ఏకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానాడు భారీ బహిరంగ సభలో ముఖ్యఅతిధిగా ప్రసంగించనున్నారు. ఎన్నికలు జరుగునున్న నేపధ్యంలో ఈ మహానాడు సభలో ముందస్తు టిడిపి మ్యేనిపేస్టో ప్రకటించనున్నారు.

ఇక నిన్న మహానాడు మొదటి రోజు సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. సభకు పోటెత్తిన లక్షల మంది అభిమాన జనసందోహంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఉద్వేగపూరిత ప్రసం గంతో అందరినీ కట్టిపడేశారు. మహానాడుకు పోటె త్తిన లక్షల మందిని చూశాక… తనలో ధీమా పెరిగిం దని,తెలుగుదేశం రావడం పక్కా అంటూ ధీమా కన బర్చారు.