పాకిస్థాన్​ కు భారత్​ కరోనా వ్యాక్సిన్లు

‘కొవ్యాక్స్’ ద్వారా 4.5 కోట్ల డోసుల పంపిణీ

న్యూఢిల్లీ: భారత్ లో తయారైన 4.5 కోట్ల కరోనా వ్యాక్సిన్లు పాకిస్థాన్‌కు పంపించ‌నున్నారు. యునైటెడ్‌ గ‌వి(GAVI) అల‌యెన్స్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్లు పాకిస్థాన్‌కు వ‌స్తున్న‌ట్లు అక్క‌డి నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీసెస్ ఫెడ‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఆమిర్ అష్ర‌ఫ్ ఖ‌వాజా అక్క‌డి ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీకి వెల్ల‌డించారు. గ‌వి అనేది ఒక వ్యాక్సిన్ అల‌యెన్స్‌. ప్రాణాంత‌క వ్యాధుల నుంచి ర‌క్షణ క‌ల్పించేలా ప్ర‌పంచంలోని సగం మంది పిల్ల‌ల‌కు వ్యాక్సినేట్ చేయ‌డానికి ఈ అల‌యెన్స్ సాయం చేస్తుంది. క‌రోనా మ‌హమ్మారి స‌మ‌యంలోనూ ఈ గ‌వియే పాకిస్థాన్‌కు సాయం చేస్తూ వ‌స్తోంది.


కాగా, పాకిస్థాన్‌కు క‌రోనా వ్యాక్సిన్లు ఇవ్వ‌డానికి గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో గ‌వీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 4.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌లో 1.6 కోట్ల డోసులు ఈ జూన్‌నాటికి పాకిస్థాన్ వ‌స్తాయ‌ని అష్ర‌ఫ్ ఖ‌వాజా చెప్పారు. ఈ వ్యాక్సిన్లు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌ని సెనేట‌ర్ ముషాహిద్ హుస్సేన్ స‌య్య‌ద్ ప్ర‌శ్నించిన‌ప్పుడు..  సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ ను కొవ్యాక్స్ ఆఫ్ ఇండియా నుంచి వ‌స్తున్న‌ట్లు ఖ‌వాజా తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/