విపక్షాల అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయనున్న ఏపి ప్రభుత్వం

YSRCP to support Modi govt in Parliament, vote against no-trust motion

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఘటనపై ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేకంగా ఓటేయనుంది. ప్రధాని మోడీకి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల అంశంపై ప్రధాని మౌనం వీడాలని, పార్లమెంటులో ప్రకటన చేయాలంటూ పట్టుబడుతూ వస్తున్న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 26 పార్టీలతో కూడిన ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ గత బుధవారం ఈ నోటీసులు అందజేశారు. అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్‌ ఓ బిర్లా సమ్మతించారు. అయితే అది సభ ముందుకు ఎప్పుడు రానుందనే అంశంపై ఇంకా స్పష్ట రాలేదు. కాగా, ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని వైఎస్‌ఆర్‌సిపి నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

కాగా, అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిచ్చేది లేదని వైఎస్‌ఆర్‌సిపి ఇప్పటికే స్పష్టం చేసింది. నో కాన్ఫిడెన్స్‌ మోషన్‌ ప్రవేశపెట్టి లాభం ఏంటని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రెండు శత్రు దేశాలు కాచుకుని కూర్చున్న వేళ, మణిపూర్‌ అడ్డుకుతున్న సమయంలో కేంద్రాన్ని బలహీన పర్చాలని చూడటం జాతి ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. ఇది అందూ కలిసి పనిచేయాల్సిన సమయమని, పరస్పరం వ్యతిరేకంగా పనిచేయాల్సిన టైం కాదన్నారు. అందువల్ల తాము అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసి కేంద్రానికి మద్దతుగా నిలుస్తామని ట్విట్టర్‌ వేదికగా ఆయన ప్రకటించారు. అదువిధంగా వచ్చేవారం రాజ్యసభ ముందుకు రానున్న ఢిల్లీ అధికారాల బిల్లుకు కూడా మద్దతు తెలుపనున్నది. అయితే ప్రతిపక్షాలతోపాటు బిఆర్‌ఎస్‌ పార్టీ కూడా ప్రధాని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.